: పాలమూరులో అగ్ని ప్రమాదం... ఇద్దరు పిల్లలు సహా తల్లి సజీవ దహనం
తెలంగాణలో వెనుకబడ్డ పాలమూరు జిల్లాలో గత రాత్రి ఘోరం జరిగిపోయింది. షాద్ నగర్ లోని పటేల్ నగర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా తల్లి సజీవ దహనమైంది. ఇంటిలో కుటుంబమంతా ఆదమరచి నిద్రిస్తున్న సమయంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో తల్లి విజయతో పాటు ఆమె పిల్లలు మల్లిక (15), రాంచరణ్ (5) మంటల్లోనే కాలిబూడిదయ్యారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. లారీ యజమానిగా పనిచేస్తున్న ఆ ఇంటి యజమాని ఇంటిలో ఉంచుకున్న డీజిల్, కిరోసిన్ ల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.