: బావిలో పడిన గున్న ఏనుగు... రక్షించుకునేందుకు వచ్చిన 26 పెద్ద ఏనుగులు


అటవీ విస్తీర్ణం తగ్గిపోతున్న నేపథ్యంలో జనావాసాల వద్దకొస్తున్న గజరాజులు, జనాన్ని భయభ్రాంతులకు గురి చేయడమే కాక ప్రమాదాల బారినా పడుతున్నాయి. చిత్తూరు జిల్లా పరిధిలో గతంలో ఓ గున్న ఏనుగు గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా అదే జిల్లా రామకుప్పం మండలం చిక్కుపల్లితండా వద్ద మరో గున్న ఏనుగు ప్రమాదంలో పడింది. పంట పొలాల వద్దకు వచ్చిన ఓ చిన్న ఏనుగు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిపోయింది. గున్న ఏనుగు చేసిన ఆర్తనాదాలు విన్న దాదాపు 26 పెద్ద ఏనుగులు అక్కడికి చేరుకున్నాయి. బావి చుట్టూ చేరి గున్న ఏనుగును ఎలా రక్షించుకోవాలో తెలియక ఆర్తనాదాలు చేస్తున్నాయి. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖాధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వీర్నమలకు దారితీసే రోడ్డుపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశారు.

  • Loading...

More Telugu News