: మెగాస్టార్ బర్త్ డే పార్టీలో తారాతోరణం... సూటు బూటుతో పవన్ కనువిందు


హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే పార్టీకి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేశారు. అల్లు అరవింద్, రాధ, నాగార్జున, శ్రీదేవి, సుహాసిని, లిజీ, బోయపాటి శ్రీను, కమల్ హాసన్, గౌతమి, రేవతి, శత్రుఘ్న సిన్హా, టి.సుబ్బరామిరెడ్డి, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్, కె. విశ్వనాథ్, భార్యతో కలిసి గోపీచంద్, అఖిల్, నితిన్, మంచు విష్ణు దంపతులు, క్రీడారంగ ప్రముఖుడు చాముండేశ్వరీనాథ్, శ్రీను వైట్ల, జయంత్ సి పరాన్జీ, వీవీ వినాయక్, కోట శ్రీనివాసరావు, ఈనాడు గ్రూప్ నుంచి కిరణ్, శైలజ, మ్యూజిక్ డైరక్టర్ మణిశర్మ, హీరోయిన్ ప్రణీత, మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్, కమెడియన్ అలీ దంపతులు, ఖుష్బూ, కోడి రామక్రష్ణ, బ్రహ్మాజీ తదిరులు విచ్చేశారు. కాగా, చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ ఈ పార్టీకి సూటు బూటు ధరించి రావడం విశేషం. క్లీన్ షేవ్ తో, బ్లాక్ సూటులో ఆయన ఆకట్టుకునేలా ఉన్నారు.

  • Loading...

More Telugu News