: తుపాకులు పేల్చలేక ఎస్పీ ముందు నీళ్లు నమిలిన పోలీసులు... సీఐదీ అదే తీరు!


భారత్ లో పోలీస్ వ్యవస్థ పలు దేశాల పోలీస్ వ్యవస్థలతో పోల్చితే చాలా వెనుకబడి ఉందన్నది కాదనలేని వాస్తవం. రాష్ట్రాలు రాజకీయాల కారణంగా తమ పోలీస్ వ్యవస్థలను భ్రష్టు పట్టించాయన్నది అంతకంటే కటువైన నిజం! "కేసులు ఎక్కువవుతున్నాయి... కాపాడు దేవుడా" అంటూ తమిళనాడులో పోలీసులే జంతుబలి ఇవ్వడం చూశాం! వృత్తి పట్ల నిబద్ధత లోపించడం, సామర్థ్యానికి పదునుపెట్టుకునే విధానాలు లేకపోవడం పోలీసుల చేవను నీరుగారుస్తున్నాయి. యూపీలోని మధుర పోలీసులు కూడా అదే కోవలోకి వస్తారు. వీళ్ల ఘనత ఎలాంటిదంటే... తుపాకులు పేల్చడం చేతగాక జిల్లా ఎస్పీ ముందు నీళ్లు నమిలారు. రైఫిళ్లు, పిస్టళ్ల వినియోగం తెలియక దిక్కులు చూశారు. వారిలో ఓ సీఐ కూడా ఉండడం గమనార్హం. కనీసం వాటి భాగాల పేర్లు కూడా చెప్పలేకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కెమెరా సాక్షిగా ఈ టెస్టు పెట్టడంతో జిల్లా పోలీసులు కుడితిలో పడ్డ ఎలుకల్లా గిజగిజలాడిపోయారట. దాంతో, ఎస్పీకి ఒళ్లు మండిపోయింది. త్వరలోనే శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, తప్పనిసరిగా హాజరవ్వాలంటూ ఆదేశించారు. అన్నట్టు... రాత పరీక్షలోనూ యూపీ పోలీసులు తేలగొట్టేశారట.

  • Loading...

More Telugu News