: ఏపీలో పలు పథకాల కింద ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ ఉత్తర్వులు
రాష్ట్రంలో పలు పథకాల కింద ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేసింది. హుద్ హుద్ తుఫాను బాధితులకు 10వేల గృహాల నిర్మాణం, ఐఏవై కింద 78,258 గృహాలు నిర్మించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం కింద లక్షా 11వేల 742 గృహాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో తెలిపింది. ఒక్కో గృహ నిర్మాణానికి రూ.2.75 లక్షలు ఖర్చు చేయనుంది. ఎస్సీ, ఎస్టీలకు 75వేలు రాయితీ, లక్ష రూపాయలు రుణం ఇవ్వాలని; సాధారణ కేటగిరీలో లక్షా 25వేలు రాయితీ, రూ.1.50 లక్షలు రుణం ఇవ్వాలని నిర్ణయించింది.