: ములాయం బయోపిక్ ను బహిష్కరించండి: అమితాబ్ కు ఫ్యాన్స్ విజ్ఞప్తి
సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ జీవితం ఆధారంగా నిర్మితం కానున్న 'నేతాజీ ములాయం సింగ్ యాదవ్' చిత్రాన్ని బహిష్కరించాలని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు ఫ్యాన్స్ విజ్ఞప్తి చేశారు. ఆ సినిమాకు ప్రచారం చేయవద్దని కోరారు. కొన్ని రోజుల క్రితం ములాయం మహిళలపై అత్యాచారాలకు సంబంధించి తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ములాయం సినిమాకు ప్రచారం చేయడమంటే... ఆయన చేసిన వ్యాఖ్యలకు, ఆయన స్త్రీ ద్వేష భావజాలానికి విలువ ఆపాదించడమేనని మీటాలి దడ్వాలే ఆందోళన వ్యక్తం చేశారు. దడ్వాలే చేంజ్.కామ్ లో ఈ విషయమై ఓ ఆన్ లైన్ పిటిషన్ పోస్టు చేశారు. అమితాబ్ ఆ సినిమాను బహిష్కరించాలని సంతకాల సేకరణకు తెరదీశారు.