: ఆ అమ్మాయి ఆత్మహత్య అనంతరం ప్రేమికులు శుభవార్త విన్నారు!
ముంబయి మహానగరంలో ఇటీవల పోలీసులు హోటళ్లు, పబ్ లు, పార్కులపై దాడులు నిర్వహించి అనేకమంది ప్రేమ పక్షులను అదుపులోకి తీసుకున్నారు. మోరల్ పోలీసింగ్ పేరిట చేపట్టిన ఈ డ్రైవ్ విమర్శలపాలైంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పోలీసుల తీరును తప్పుబట్టారు. ఈ దాడుల్లో పోలీసులకు పట్టుబడిన ఓ అమ్మాయి ఆ తర్వాత అవమానభారంతో ఆత్మహత్య చేసుకుంది. తప్పు చేయకపోయినా, కన్నవారి ఎదుట తలదించుకోవాల్సి వచ్చిందని తన సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఈ ఉదంతం తర్వాత ముంబయి వాసులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. పౌరుల స్వేచ్ఛకు భంగం కలిగించే అధికారం పోలీసులకు ఎవరిచ్చారంటూ ఎలుగెత్తారు. దాంతో, పరిస్థితి తీవ్రరూపు దాల్చుతోందని అర్థం చేసుకున్న ముంబయి పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా ప్రేమికులకు శుభవార్త అనదగ్గ రీతిలో ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రేమికుల జోలికి వెళ్లవద్దని పోలీసులకు సూచించారు. మోరల్ పోలీసింగ్ పేరిట దాడులు చేపట్టరాదని అన్ని స్టేషన్లకు సమాచారం పంపారు. ప్రేమికులు సన్నిహిత స్థితిలో కనిపించినా ఏమీ అనవద్దని స్పష్టం చేశారు.