: పవన్ వ్యాఖ్యలపై పాజిటివ్ గా స్పందించండి... పార్టీ నేతలకు చంద్రబాబు హితవు
భూసేకరణను వ్యతిరేకిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు సీఎం చంద్రబాబు పుల్ స్టాప్ పెట్టారు. పవన్ పై ప్రతి విమర్శలకు దిగొద్దని నేతలకు హితవు పలికారు. కొంతమంది రైతులు పవన్ ను ఆశ్రయించినందున వారి సంక్షేమం కోసం ఆయన మాట్లాడటంలో ఎలాంటి తప్పులేదన్నారు. భూసేకరణపై వాస్తవ పరిస్థితులను పవన్ కు తానే స్వయంగా వివరిస్తానని బాబు చెప్పారు. రేపు సీఎంను పవన్ కలుస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలోనే అన్ని విషయాలపై మాట్లాడవచ్చు.