: ఎన్ క్లోజర్ లో ఉండాల్సిన పులి బయటికి వచ్చింది... హైదరాబాద్ జూలో హడలిపోయిన సందర్శకులు
హైదరాబాదులోని జంతు ప్రదర్శనశాలలో శనివారం ఓ పెద్ద పులి (రాయల్ బెంగాల్ టైగర్) తన ఎన్ క్లోజర్ నుంచి బయటికి రావడంతో భీతావహ వాతావరణం నెలకొంది. ఓ ఎన్ క్లోజర్ నుంచి మరో ఎన్ క్లోజర్ లోకి మార్చే సమయంలో ఆ పులి బయటికి వచ్చేసింది. దాంతో, జూపార్క్ సందర్శనకు వచ్చిన వారు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న జూ సిబ్బంది, పోలీసులు వెంటనే స్పందించారు. జూపార్క్ నుంచి సందర్శకులను వెలుపలికి తరలించి, ఆపై పులిని బంధించారు. ట్రాంక్విలైజర్ (మత్తుమందు) సాయంతో దాన్ని బంధించి, మరో ఎన్ క్లోజర్ లో ప్రవేశపెట్టారు. కాగా, ఆ పులి ఎవరికీ హాని తలపెట్టకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.