: దత్తత తీసుకోబోతున్న గ్రామానికి మహేష్?


'శ్రీమంతుడు' చిత్రం విజయంతో జోరు మీదున్న సినీ నటుడు మహేష్ బాబు ఇటీవల తెలంగాణలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు అంగీకరించారు. త్వరలోనే ఈయన ఆ గ్రామానికి వెళ్లనున్నారని తెలుస్తోంది. కొన్ని రోజుల కిందట శ్రీమంతుడు సినిమా చూసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలంగాణలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని మహేష్ ను కోరడం, అందుకు ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. అనంతరం మహబూబ్ నగర్ జిల్లాలోని చింతలకుంట గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటున్నట్టు మహేష్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ నెల 29న ఆ గ్రామంలో మహేష్ పర్యటిస్తారని సమాచారం. గ్రామంలో పరిస్థితులు, అక్కడ అవసరమైన సౌకర్యాలు, ఇతర విషయాలపై గురించి ప్రిన్స్ తెలుసుకునే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News