: దావూద్ గురించి పక్కా సాక్ష్యాలున్నాయి... పాకిస్తాన్ అతనిని అప్పగించాల్సిందే: బీజేపీ


మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోనే ఉన్నాడని భారత నిఘా వర్గాలు కనుగొని, అందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా వెల్లడించాయి. తాజాగా దానిపై బీజేపీ స్పందిస్తూ, దావూద్ గురించి తిరుగులేని సాక్ష్యాలు భారత్ వద్ద ఉన్నాయని, పాకిస్తాన్ వెంటనే అతన్ని అప్పగిచాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, "దావూద్ తమ దేశంలో నివసించడం లేదని పాక్ ఎల్లప్పుడూ చెబుతూ వచ్చింది. కానీ, మేమిప్పుడు ప్రపంచం ముందు నిర్దిష్ట సాక్ష్యాన్ని ఉంచాం. ఈ విషయాన్ని పాక్ అర్థం చేసుకుని తక్షణమే భారత్ కు అప్పగించాలి" అని స్పష్టం చేశారు. దావూద్ పాక్ లో ఉన్నాడంటూ పక్కా సాక్ష్యాధారాలతో నివేదిక ఉందని, దాన్నెవరూ తిరస్కరించడానికి వీలులేనిదని బీజేపీ కార్యదర్శి సిద్ధార్థ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News