: సెంచరీ బాది అవుటైన మాథ్యూస్ ... శ్రీలంక స్కోరు 284/6


కొలంబో టెస్టు మూడో రోజు ఆటలో శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ 102 పరుగులు చేసి అవుటయ్యాడు. టీమిండియా బౌలర్ బిన్నీ ఆఫ్ స్టంప్ ఆవల పిచ్ చేసిన బంతిని ఆడే ప్రయత్నంలో మాథ్యూస్ స్లిప్స్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో జెహాన్ ముబారక్, ధమ్మిక ప్రసాద్ ఉన్నారు. అంతకుముందు, తిరిమన్నే 62 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఫామ్ లో ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దినేశ్ చాందిమల్ 11 పరుగులు చేసి ఇషాంత్ శర్మకు వికెట్ అప్పగించాడు. టీమిండియా బౌలర్లలో ఇషాంత్ 2 వికెట్లు తీయగా, యాదవ్, బిన్నీ, అశ్విన్, మిశ్రా తలో వికెట్ పడగొట్టారు.

  • Loading...

More Telugu News