: సీఆర్డీఏ ముట్టిడిలో కృష్ణాయపాలెం రైతులు... ముందుగా గ్రామకంఠాలను తేల్చాలని డిమాండ్
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన భూమి కోసం భూసేకరణ చట్టం కింద ఏపీ సర్కారు నిన్న జారీ చేసిన నోటిఫికేషన్ పై ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. నోటిఫికేషన్ పై ఇప్పటికే విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, తాజాగా నేటి ఉదయం మంగళగిరి మండలం కృష్ణాయపాలెం రైతులు సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. గ్రామకంఠాలను తేల్చకుండా నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తారని ఈ సందర్భంగా రైతులు అధికారులను నిలదీశారు. నోటిఫికేషన్ జారీ చేసిన గ్రామాలకు సంబంధించి ముందుగా గ్రామకంఠాలను నిర్ధారించాలని వారు డిమాండ్ చేశారు.