: దశలవారీగా భూసేకరణ నోటిఫికేషన్లు: మంత్రి నారాయణ
భూసేకరణలో గ్రామ కంఠాలను తొలగిస్తారన్న ఆందోళనలో అర్థం లేదని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. డిసెంబర్ 8 నాటి ఉపగ్రహ చిత్రాల ప్రకారమే గ్రామ కంఠాలను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. సిబ్బందిని దృష్టిలో ఉంచుకుని తొలిదశలో 5 గ్రామాల్లో భూసేకరణ చేపట్టామని, తదుపరి భూసేకరణ నోటిఫికేషన్లు దశలవారీగా జారీ చేస్తామని మీడియా సమావేశంలో తెలిపారు. అయితే రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వాలని అభ్యర్థించారు. ప్రతిపక్షాలు భూసేకరణ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.