: విజయవాడలో టీడీపీ కీలక సమావేశం ప్రారంభం... పలు ముఖ్య విషయాలపై చర్చ
తెలుగుదేశం పార్టీ కీలక సమావేశం విజయవాడలో ప్రారంభమైంది. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు దీనికి హాజరయ్యారు. పార్టీ కేంద్ర కమిటీ, రెండు రాష్ట్రాలకు కమిటీల ఏర్పాటు వంటి విషయాలపై చర్చిస్తున్నారు. అంతేగాక త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాసనసభ, శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహం, పథకాల అమలు, ప్రత్యేక హోదా, ప్యాకేజీ, రాజకీయ పరిణామాలపై కూడా ప్రధానంగా చర్చించనున్నారు.