: చంద్రబాబు సీఎం అయ్యారని... టీడీపీ వృద్ధ నేత సుదీర్ఘ ‘వెనకడుగు’ యాత్ర!
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఆ పార్టీకి చెందిన 69 ఏళ్ల వయస్సున్న కొల్లు నాయుడమ్మ వీరాభిమాని. 2004 తర్వాత చంద్రబాబు మరోమారు సీఎం కావాలని తిరుమల వెంకన్నకు ఆయన మొక్కున్నారు. 2009 ఎన్నికలకు ముందు ప్రకాశం జిల్లాలోని తన సొంతూరు ఇంకొల్లు నుంచి తిరుమలకు వెనకడుగు వేసుకుంటూ ఏకంగా 315 కిలో మీటర్ల యాత్ర చేశారు. అయితే నాడు నాయుడమ్మ కోరిక తీరలేదు. 2014లో ఆయన కల తీరింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఆయన అన్నవరం నుంచి తిరుమలకు వెనకడుగు వేస్తూ మహాయాత్రకు నిన్న శ్రీకారం చుట్టారు. దాదాపు 800 కిలో మీటర్ల దూరాన్ని ఆయన వెనకడుగు వేసుకుంటూనే ముందుకు సాగుతారట. ఇంకొల్లు గ్రామానికి నాలుగు దఫాలుగా సర్పంచ్ గా, పరుచూరు మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన నాయుడమ్మ నెల వ్యవధిలో మహాయాత్రను పూర్తి చేయాలని వెనకడుగు వేస్తూ సాగుతున్నారు.