: చిరంజీవికి 60 ఏళ్లా?...మెగాస్టార్ ఎప్పుడూ 26 ఏళ్ల యువకుడే: రాంగోపాల్ వర్మ ట్వీట్స్


టాలీవుడ్ లో మెగాస్టార్ గా నీరాజనాలందుకున్న కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి నేడు తన 60వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. చిరంజీవి షష్టిపూర్తి అంటూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే చిరంజీవి 60వ బర్త్ డేపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ విచిత్రంగా స్పందించారు. తనకు బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పే అలవాటు లేదంటూనే చిరు పట్ల తనకున్న అభిమానాన్ని ఆయన తనదైన శైలిలో చెప్పారు. ట్విట్టర్ వేదికగా నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. ‘నేనెవరికీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పను. అయితే చిరంజీవి గారూ, మీ బర్త్ డే నాకు మహా సంతోషం. అందుకే మీకు మా జన్మదిన శుభాకాంక్షలు. మీకు 60 ఏళ్లంటే నాకు నచ్చట్లేదు. ఈ విషయాన్ని అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం అంతకన్నా నచ్చడం లేదు. మాకు , మీ అభిమానులకు మీరెప్పటికీ 26 ఏళ్ల యువకులే’’ అని వర్మ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News