: పవన్ కల్యాణ్ కు షాకిచ్చిన బేతపూడి గ్రామస్థులు... రాజధాని నిర్మాణానికి అడ్డు తగలొద్దని హితవు


భూసేకరణపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరుగుతున్న జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్ కు రాజధాని పరిధిలోని బేతపూడి గ్రామస్థులు షాకిచ్చారు. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూములకు సంబంధించి అడ్డు తగలొద్దని ఆయనకు సూచించారు. ఈ మేరకు నిన్న పవన్ కల్యాణ్ తీరుకు నిరసనగా వారు ఆందోళనకు దిగారు. రాజధాని నిర్మాణానికి సహకరించకున్నా, అడ్డు తగలొద్దని పవన్ ను కోరారు. ప్రభుత్వం చేపడుతున్న భూ సమీకరణకు తామంతా అనుకూలమేనని కూడా వారు ప్రకటించారు.

  • Loading...

More Telugu News