: చెన్నై జట్టు సస్పెన్షన్ పై బీసీసీఐకి మద్రాస్ హైకోర్ట్ నోటీస్


ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును జస్టిస్ లోధా కమిటీ సస్పెండ్ చేయడంపై బీసీసీఐకి మద్రాస్ హైకోర్ట్ నోటీసు జారీ చేసింది. త్వరలో సమాధానాన్ని తెలపాలని ఆదేశాలు ఇచ్చింది. ఇదే సమయంలో ఈ విచారణలో భాగమయ్యేందుకు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బీహార్ ను కూడా కోర్టు అనుమతించింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. ఐపీఎల్ నుంచి తమ జట్టును సస్పెండ్ చేస్తూ గత నెలలో లోథా కమిటీ ఇచ్చిన ఆదేశంపై స్టే ఇవ్వాలంటూ చెన్నై జట్టు యజమాని పిటిషన్ లో కోరారు. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ టీఎస్ శివజ్ఞానంల ద్విసభ్య బెంచ్ ఈ పిటిషన్ పై నేడు విచారణ జరిపింది.

  • Loading...

More Telugu News