: రూ. లక్ష కోట్ల క్లబ్ నుంచి టాటా మోటార్స్ ఔట్!


గడచిన రెండు సెషన్ల వ్యవధిలో 6 శాతానికి పైగా దిగజారిన వాహన దిగ్గజం టాటా మోటార్స్ రూ. లక్ష కోట్ల మార్కెట్ కాప్ ను కలిగివున్న కంపెనీల జాబితాలో స్థానాన్ని కోల్పోయింది. టాటా మోటార్స్ ఈక్విటీ విలువ ప్రస్తుతం 18 నెలల కనిష్ఠానికి పడిపోయింది. ఫిబ్రవరి 2014 తరువాత ఆ సంస్థ ఈక్విటీ రూ. 331కి చేరింది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ గణాంకాల ప్రకారం సంస్థ మార్కెట్ కాప్ రూ. 1,11,130 కోట్ల నుంచి రూ. 15,983 కోట్లు తగ్గి రూ. 95,147 కోట్లకు చేరింది. మొత్తం మీద మార్కెట్ కాప్ విషయంలో టాటా మోటార్స్ 22వ స్థానానికి పడిపోయింది. సరిగ్గా ఆరు నెలల క్రితం ఫిబ్రవరిలో రూ. 1,76,471 కోట్ల మార్కెట్ కాప్ తో 13వ స్థానంలో ఉన్న సంస్థ ఈక్విటీ విలువ ఆ సమయంలో రూ. 577 వద్ద ఉంది. ఆ ధరతో పోలిస్తే ఇప్పుడు సుమారు 43 శాతం పడిపోయింది. కార్ల అమ్మకాలు గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణం. కాగా, శుక్రవారం నాటి సెషన్లో బీఎస్ఈ-500లోని 33 కంపెనీలు 52 వారాల కనిష్ఠానికి పడిపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒత్తిడికి లోనయ్యాయి. పేమెంట్ బ్యాంకులు వస్తే ప్రధాన బ్యాంకుల వ్యాపారం తగ్గుతుందన్న అంచనాలే ఇందుకు కారణం.

  • Loading...

More Telugu News