: సీఎం కేసీఆర్ కు నా ప్రత్యేక కృతజ్ఞతలు: డీఎస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా తనను నియమించినందుకు సీఎం కేసీఆర్ కు టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ప్రత్యేక బాధ్యతను సీఎం తనకు అప్పగించారన్నారు. అంతర్ రాష్ట్ర సమస్యల పరిష్కారానికి సీఎంకు తోడుగా ఉంటానని చెప్పారు. తన అనుభవం మేరకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. తాను ఏ కారణంతో టీఆర్ఎస్ లో చేరానో అదే దిశగా అడుగులు వేస్తానని చెప్పారు. బంగారు తెలంగాణ సాధనను ఈ దశాబ్దంలో పూర్తి చేయడానికి కృషి చేస్తానని డీఎస్ తెలిపారు.