: పవన్ కల్యాణ్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు: టీడీపీ ఎంపీ నిమ్మల సంచలన వ్యాఖ్య


టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన భూమి కోసం ఏపీ ప్రభుత్వం నేటి ఉదయం భూసేకరణ చట్టం కింద నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇదివరకే నిరసన వ్యక్తం చేశారు. రైతులను ఒప్పించి భూములను తీసుకోవాలని, అలా కాకుండా రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటే రైతుల తరఫున పోరాటం చేస్తానని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన నిమ్మల కిష్టప్ప, భూసేకరణ చట్టం ప్రయోగానికి సంబంధించి పవన్ కల్యాణ్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News