: అన్నా హజారేకు జడ్ ప్లస్ భద్రత... ఆమోదం తెలిపిన మహారాష్ట్ర ప్రభుత్వం


ప్రముఖ గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నా హజారేకు జడ్ ప్లస్ భద్రత కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు సీఎం దేేవంద్ర ఫడ్నవీస్ అందుకు ఆమోదం తెలిపారు. హజారేకు పలుమార్లు బెదిరింపు లేఖలు రావడం, ఆయన ప్రాణానికి ముప్పు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా లాతూరు జిల్లా నుంచి వన్ మహాడియో పంచాల్ పేరుతో అన్నాకు బెదిరింపు లేఖ వచ్చిందని ఆయన సహచరుడు దత్తా అవారి పర్నర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ లేఖ ఈ నెల 7వ తేదీతో ఉందని, దీనిని ఆంగ్లంలో రాశారని ఓ అధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News