: సియాజ్ హైబ్రిడ్ తో 28 కి.మీ మైలేజీ...మోస్ట్ ఫ్యూయెల్ ఎఫిసియెంట్ అంటున్న మారుతి సుజుకీ


దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ కొత్త మోడల్ ను మార్కెట్లోకి తీసుకొస్తోందట. సియాజ్ హైబ్రిడ్ పేరిట రంగప్రవేశం చేయనున్న ఈ కారు లీటరుకు 28 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుందట. దీంతో ఇప్పటిదాకా భారతీయ రోడ్లపైకి వచ్చిన కార్లన్నింటిలోకి ఈ కారే మోస్ట్ ఫ్యూయెల్ ఎఫిసియెంట్ అని కూడా ఆ కంపెనీకి చెందిన ఓ నిపుణుడు చెబుతున్నాడు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న సియాజ్ డీజిల్ వెర్షన్ కు కాస్తంత రూపురేఖలు మార్చి సియాజ్ హైబ్రిడ్ పేరిట మారుతి సుజుకీ కొత్త కారును తీసుకొస్తోందని సమాచారం. ఈ కారు హోండా సిటీకి గట్టి పోటీ ఇస్తుందని కూడా సదరు నిపుణుడు చెబుతున్నాడు. అయితే ఈ విషయంపై స్పందించేందుకు మారుతి సుజుకీ అధికార ప్రతినిధి నిరాకరించారు. కొత్త మోడళ్లపై ముందుగానే మాట్లాడటం తమ పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News