: ఏపీకి రూ.109 కోట్లు కేటాయించిన కేంద్ర పర్యాటక శాఖ
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర పర్యాటక శాఖ రూ.109 కోట్లు కేటాయించింది. ఢిల్లీలో జరిగిన కేంద్ర పర్యాటక శాఖ సమావేశంలో నిధుల కేటాయింపుపై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అందులో పులికాట్ సరస్సు ప్రాంతానికి రూ.79 కోట్లు, రాజధాని అమరావతికి రూ.30 కోట్లు కేటాయించింది. పులికాట్ సరస్సుకు ప్రతి సంవత్సరం వేసవికాలం విదేశీ పక్షులు వస్తాయి. ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా నిర్వహిస్తారు. ఈ క్రమంలో పులికాట్ సరస్సును పర్యాటకులకు అనువుగా తీర్చిదిద్దేందుకు డెబ్బై తొమ్మది కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అమరావతి అభివృద్ధికి, అక్కడున్న బౌద్ధారామాల పరిరక్షణకు మిగతా ముప్పై కోట్లు కేటాయించారు.