: ఏపీకి మరో ఘనత... త్వరలోనే రైల్వే జోన్: వెంకయ్యనాయుడు
అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రైల్వే జోన్ వస్తుందని కేంద్ర పట్ణణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. అది విజయవాడ కేంద్రంగా వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని, ప్రత్యేక జోన్ వస్తే రాష్ట్రం మరో ఘనత సాధించినట్టేనని ఆయన అన్నారు. ఈ విషయమై త్వరలోనే అనుమతులు మంజూరు అవుతాయని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీయే పాలన ప్రారంభమైన తరువాత ఏడాది వ్యవధిలోనే పలు విద్యా సంస్థలను, రాజధానికి ప్రత్యేక రైలును, వివిధ ప్యాకేజీలనూ రాష్ట్రానికి ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సహకరించాలన్న కృత నిశ్చయంతో ఉన్నట్టు వెంకయ్య వివరించారు.