: ఆరంభంలోనే పాతాళానికి..!
భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తోంది. నిన్న భారీగా పతనమైన సెన్సెక్స్, నిఫ్టీ ఈ ఉదయం సెషన్ ఆరంభంలోనే పాతాళానికి జారిపోయింది. రూపాయి సహా వర్ధమాన దేశాల కరెన్సీ విలువలతో పోలిస్తే డాలర్ బలపడటమే పెట్టుబడిదారుల సెంటిమెంటును హరించింది. దీనికితోడు కమోడిటీ మార్కెట్ల పతనం సైతం తోడైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 400 పాయింట్లు, నిఫ్టీ 120 పాయింట్ల నష్టంలో ఉన్నాయి. యూఎస్ ఫెడ్ ఇప్పట్లో వడ్డీ రేట్లు పెంచకపోవచ్చని విశ్లేషకులు చేస్తున్న అంచనాల నేపథ్యంలో స్వల్ప కాలిక పెట్టుబడుల వృద్ధికి బులియన్ మార్కెట్ మేలన్న ఆలోచనలో పడ్డ ఇన్వెస్టర్లు ఈక్విటీలను అమ్మి ఆ డబ్బు బంగారం కొనేందుకు వెచ్చిస్తున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.