: సేకరణ వద్దు, సమీకరణే ముద్దు... భూములిచ్చేసిన 108 మంది రైతులు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో భూసేకరణ నోటిఫికేషన్ ను జారీ చేసి బలవంతంగానైనా రైతుల భూములను సేకరించాలని చంద్రబాబు సర్కారు అడుగులు వేసిన నేపథ్యంలో రైతులు స్వయంగా భూములిచ్చేందుకు ముందుకు వచ్చారు. ఉండవల్లి, పెనుమాక, నవులూరు, నిడమర్రు, కురగల్లు, కృష్ణాయపాలెం గ్రామాలకు చెందిన 108 మంది రైతులు తమ భూములను రాజధాని కోసం రాసిచ్చారు. వీరంతా 123 ఎకరాలు ప్రభుత్వానికి అప్పగించారు. సేకరణలో భాగంగా, ఒక్కసారి కొంత మొత్తం తీసుకుని భూమిని ఇచ్చేకన్నా, సమీకరణలో వచ్చే కౌలు, ఆపై భూమిలో వాటాతోనే లాభపడొచ్చని వీరు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, దాదాపు 1200 ఎకరాలకు పైగా సేకరించాలన్న లక్ష్యంతో భూసేకరణ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే.