: అటల్ పెన్షన్ యోజనకు మార్పులు చేర్పులు
ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన అటల్ పెన్షన్ యోజన పథకానికి స్వల్ప మార్పులు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. అసంఘటిత రంగంలోని కార్మికులు పదవీ విరమణ తరువాత సౌకర్యవంతమైన జీవనం సాగించాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ స్కీములో భాగంగా చందాదారులు నెలవారీ నగదు చెల్లిస్తుంటే, 60 సంవత్సరాల తరువాత ఎంచుకున్న స్కీమును బట్టి నెలకు రూ.1౦౦౦ నుంచి రూ. 5 వేల వరకు మొత్తం పింఛను రూపంలో అందుతుంది. కాగా, ఇకపై నెలసరి కిస్తీల స్థానంలో మూడు నెలలకు, ఆరు నెలలకు ఒకసారి చందాను చెల్లించే వెసులుబాటును కల్పిస్తున్నట్టు ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ మేరకు అటల్ పెన్షన్ యోజనలో మార్పులు చేస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది.