: నెరవేరిన బ్యాంకు ఉద్యోగుల కల...ఇకపై నెలలో రెండు శనివారాలు బ్యాంకులు తెరచుకోవు
దేశంలోని లక్షలాది మంది బ్యాంకు ఉద్యోగుల కల నెరవేరింది. నెలలో రెండు శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలన్న వారి డిమాండ్ కు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇకపై నెలలో రెండు, నాలుగో శనివారాలు బ్యాంకులకు పూర్తి సెలవు దినాలే. ఈ రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. వచ్చే నెల 1 నుంచి ఈ కొత్త సెలవులు అమల్లోకి రానున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం నెలలో అన్ని శనివారాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ‘హాఫ్ డే’ పనిచేస్తున్న సంగతి తెలిసిందే