: ‘2జీ’ నిందితుడు ఎ. రాజా ఇంట్లో 6 కిలోల బంగారం


తమిళ తంబీలకు బంగారంపై ఉన్న మమకారం మరెవరికీ ఉండదేమో! అప్పుడెప్పుడో అక్రమాస్తుల ఆరోపణలపై తమిళనాడు సీఎం, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత ఇంటిలో సోదాలు చేయగా కిలోల కొద్దీ బంగారం మూటలు బయటపడ్డాయి. తాజాగా 2జీ స్పెక్ట్రం కేసులో ప్రధాన నిందితుడు, కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే సీనియర్ నేత ఎ. రాజా ఇంటిలోనూ కిలోల లెక్కన బంగారం బయటపడింది. అక్రమాస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎ. రాజాపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు నిన్న ఆయన ఇల్లు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో 24 ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా రాజాకు చెందినదిగా భావిస్తున్న 6 కిలోల బంగారాన్ని సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ.1.6 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు.

  • Loading...

More Telugu News