: న్యూయార్క్ లో పాఠశాల వద్ద భారీ పేలుడు... ముగ్గురికి గాయాలు


అమెరికాలో మరోమారు పేలుళ్ల కలకలం చోటుచేసుకుంది. నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతున్న కాల్పులు ఆ దేశానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో భారీ పేలుడు సంభవించింది. నగరంలోని ఓ హైస్కూల్ వద్ద చోటుచేసుకున్న ఈ పేలుడులో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డట్టు ప్రాథమిక సమాచారం. పేలుడుపై వేగంగా స్పందించిన ఆ దేశ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ పైప్ లైన్ లీకైన కారణంగానే పేలుడు సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

  • Loading...

More Telugu News