: మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన చెన్నై సూపర్ కింగ్స్


జస్టిస్ లోథా కమిటీ సిఫారసులు, బీసీసీఐ నిర్ణయంపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మద్రాసు హైకోర్టుకెక్కింది. ఐపీఎల్ నుంచి రెండేళ్లపాటు నిషేధం విధించడాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సవాలు చేసింది. ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో యాజమాన్యం పాత్రపై నిజాలు నిగ్గుతేలడంతో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్లు నిషేధం విధిస్తూ జిస్టిస్ లోథా కమిటీ సిఫారసు చేసింది. ఆ సిఫారసును బీసీసీఐ అమలు చేసింది. దీంతో భారీ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలో అర్థం కాక, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.

  • Loading...

More Telugu News