: మోదీ యాక్షన్ పీఎం కాదు... ఆక్షన్ పీఎం: జైరామ్ రమేశ్
కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్ ప్రధాని నరేంద్ర మోదీపై ధ్వజమెత్తారు. ఆయన యాక్షన్ పీఎం కాదని, ఆక్షన్ పీఎం అని విమర్శించారు. "ఆయన బొగ్గు గనులను, స్పెక్ట్రమ్ ను వేలం వేశారు. ఇప్పుడొచ్చి బీహార్ ను వేలానికి పెట్టి, రాష్ట్రంతో తమాషా చేశారు. ఎంత ప్యాకేజీ ఇవ్వాలి? అని సభకు హాజరైన ప్రజలను పదేపదే అడగడం వారి ఆత్మగౌరవంతో ఆడుకోవడమే. తమ ఆత్మాభిమానం పరిహాసానికి గురికావడాన్ని బీహార్ ప్రజలు సహించరు" అని పేర్కొన్నారు. బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ బీహార్ కు రూ.1.25 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. దీంతో, బీహార్ లోని జేడీ (యూ), ఆర్జేడీ వంటి పార్టీలకే కాకుండా, కాంగ్రెస్ కు కూడా దిమ్మ తిరిగిపోయింది. ప్యాకేజీ ప్రకటన తమను రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేసేందుకు మోదీ వేసిన ఎత్తుగడగా ఆయా పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.