: సినిమాలకు దూరంగా ఉన్నా నో ప్రాబ్లం... చిటికేస్తే స్టెప్పులేనంటున్న మెగాస్టార్


మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి తన 60వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ వార్తా చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నా, చిటికేస్తే చాలు ఇప్పటికిప్పుడు స్టెప్పులొచ్చేస్తాయని ధీమాగా చెప్పారు. ఎక్కడైనా మ్యూజిక్ వింటే చాలు... కాళ్లు వాటికవే కదులుతాయని తెలిపారు. సినిమా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు సంగీతం వినిపిస్తుంటుందని, అలాంటప్పుడు తాను పైకి గంభీరంగానే కనిపిస్తానని చెప్పారు. అయితే, మనసులో మాత్రం స్టెప్పులేస్తానని వివరించారు. రేసుగుర్రం సినిమాలో హీరోయిన్ శృతి హాసన్ మనసులోనే నవ్వుకుంటుందని, తానూ అంతేనని, మనసులోనే డ్యాన్సు చేస్తానని అన్నారు.

  • Loading...

More Telugu News