: తోటి ఖైదీల దాడితో కోర్టును ఆశ్రయించిన నిర్భయ కేసు నిందితుడు
దేశంలో మహిళలపై హింసాకాండకు పరాకాష్ఠలా నిలిచిన నిర్భయ ఉదంతం సంచలనం సృష్టించడం తెలిసిందే. కాగా, నిర్భయ రేప్ కేసులో నిందితుల్లో ఒకడైన వినయ్ శర్మపై తీహార్ జైలులో మంగళవారం రాత్రి దాడి జరిగింది. తోటి ఖైదీలే వినయ్ శర్మపై దాడికి దిగారు. దాంతో, తనకు మరింత భద్రత కల్పించాలని కోరుతూ వినయ్ శర్మ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ ఘటనలో తన ఎడమ చేయి విరిగిందని అతడు న్యాయమూర్తికి తెలిపాడు. వినయ్ శర్మ పిటిషన్ పై న్యాయస్థానం మంగళవారం విచారణ జరపనుంది.