: కేవలం 3000 ఎకరాల కోసం పవన్ రాద్ధాంతం చేయడం తగదు: మంత్రి రావెల కిషోర్ బాబు


కేవలం 3000 ఎకరాల కోసం జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ రాద్ధాంతం చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు హితవు పలికారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పవన్ కల్యాణ్ అడ్డుపడకూడదని అన్నారు. రాజధాని, పరిశ్రమల కోసం భూసేకరణ చేయడం కొత్తేమీ కాదని ఆయన తెలిపారు. చంద్రబాబుపై నమ్మకంతోనే రైతులు భూములు స్వచ్ఛందంగా ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రాజధాని నిర్మాణానికి పవన్ కల్యాణ్ సలహాలు, సూచనలు ఇవ్వాలే తప్ప విమర్శలు చేయకూడదని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News