: 'చట్టం' పేరు చెప్పి దౌర్జన్యానికి దిగితే ఇక గొడవలే: రాజధాని భూములపై వైకాపా


అమరావతి ప్రాంతంలో భూములకు సంబంధించి రైతులపై చట్టాల పేర్లు చెప్పి దౌర్జన్యానికి దిగితే చూస్తూ ఊరుకోబోమని వైకాపా హెచ్చరించింది. ఇప్పటికే 33,400 ఎకరాలు తీసుకున్నారని గుర్తు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఇంకా భూమెందుకని ప్రశ్నించారు. ఈ మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. 'చట్టం' పేరు చెప్పి ముందుకెళ్లాలని భావిస్తే, గొడవలు జరుగుతాయని హెచ్చరిస్తూ, సింగపూర్ ప్రభుత్వంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని భావిస్తే సహించబోమన్నారు. ఇప్పటివరకూ గ్రామ కంఠాలను కూడా గుర్తించలేదని, భూసేకరణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు తాము చేసే పోరాటానికి మద్దతిచ్చే వారితో కలసి పనిచేస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News