: తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలోని రెండో ఘాట్ రోడ్డు మీద 10వ కిలోమీటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనతో, రోడ్డు మీద భారీ సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి. వెంకన్న ఆలయానికి చేరుకోవడానికి మరో మార్గం లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న టీటీడీ అధికారులు, సిబ్బంది కొండచరియలను తొలగించే పనిలో పడ్డారు.