: ఎయిర్ ఇండియాకు కొత్త బాస్ గా అశ్వని లొహానీ!
ప్రభుత్వ రంగ పౌర విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కొత్త చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరుగా అశ్వని లొహానీ నియామకం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టరుగా ఉన్న లొహానీకి ఏఐ బాధ్యతలు అప్పగించాలని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. మెకానికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన లొహానీ 1980 బ్యాచ్ కి చెందిన ఇండియన్ రైల్వే సర్వీసెస్ అధికారి. కాగా, ప్రస్తుతం ఎయిర్ ఇండియా చైర్మన్ గా ఉన్న రోహిత్ నందన్ పదవీకాలం గత సంవత్సరమే పూర్తి కాగా, ఆయన పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించిన సంగతి తెలిసిందే. ఆయన తదుపరి ఏఐ బాధ్యతలను లొహానీ చేపట్టే అవకాశాలున్నాయి.