: లోకేష్ రాహుల్ సెంచరీ
టీమిండియా యువ బ్యాట్స్ మెన్ లోకేష్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో లోకేష్ రాహుల్ సమయానుకూలంగా ఆడి సెంచరీ సాధించాడు. మొత్తం 180 బంతులను ఎదుర్కొన్న రాహుల్ 12 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో ఈ ఫీట్ సాధించాడు. రాహుల్ సెంచరీతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించే దిశగా సాగుతోంది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు. రాహుల్ (106), రోహిత్ శర్మ (30) క్రీజులో ఉన్నారు.