: ప్రఖ్యాత 'సుధాకార్స్'లో అగ్నిప్రమాదం... భారీగా ఆస్తి నష్టం
విభిన్న రూపాల్లో తయారు చేసిన కార్లతో చిన్నారులతో సహా పెద్దవారిని కూడా విశేషంగా ఆకట్టుకుంటున్న సుధాకార్స్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగానే సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాదులోని బహదూర్ పురాలో సుధాకార్స్ ఉంది.