: పనివేళలు ముగిసేవరకే టీచర్... ఆ తర్వాత మరో వ్యక్తి బయటికొస్తాడు!


తమిళనాడులోని ధర్మపురి జిల్లాకు చెందిన రమేశ్ వృత్తిరీత్యా ఓ టీచర్. ఎంఎస్సీ, బీఈడీ చదవిన రమేశ్ జిల్లాలోనే ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పనివేళలు ముగిసేవరకే ఆయన టీచర్. ఆ తర్వాత ఆయనలోని మరో వ్యక్తి బయటికొస్తాడు. పూజారి వేషం వేసుకుని దైవ వాక్కులు చెబుతుంటాడు. అందులో విశేషం ఏముందంటారా? ఏదో మామూలుగా ప్రవచనాలు వల్లిస్తే సమస్యేమీలేదు. కానీ, పూటుగా మందుకొట్టి, చుట్ట పీకుతూ వాక్కులు చెబుతుంటాడు. టీచర్ గా పనిచేస్తూనే ఈయన ఆ ప్రాంతంలో రెండు ఆలయాలు నిర్మించాడు. సాయంత్రం కాగానే వాటిలో తన ప్రవృత్తికి తెరదీస్తాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... తాను మద్యం తాగి దైవవాక్కులు చెబుతున్నా, ప్రజలకు మాత్రం తద్విరుద్ధమైన సందేశం ఇస్తాడు. మద్యపానం హానికరమని, దానికి బానిస కారాదని హితబోధ చేస్తాడు. భక్తులు కూడా సరేసరి! రమేశ్ కు మద్యం సీసాలే కానుకలుగా సమర్పించుకుని భక్తిని చాటుకుంటారు. ఆ మద్యం తాగిన కాసేపటికే రమేశ్ కు పూనకం వస్తుంది. ఆపై ఓ చుట్ట వెలిగించి దమ్ము లాగుతూ తన ప్రవచనాలు మొదలుపెడతాడు. రమేశ్ సాక్షాత్తూ దైవస్వరూపమని, ఆయనవి దేవతా ఆశీర్వచనాలని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఒళ్లంతా శూలాలు గుచ్చుకుని మొక్కులు తీర్చుకుంటారు.

  • Loading...

More Telugu News