: ఫోన్లపై భారతీయులు పెడుతున్న ఖర్చు ఇదే!


స్మార్ట్ ఫోన్ల మయమైన నేటి యుగంలో, కాల్స్ చేసేందుకు, డేటా వినియోగం నిమిత్తం భారతీయులు పెడుతున్న ఖర్చెంతో తెలుసా? ఈ సంవత్సరం 21.4 బిలియన్ డాలర్లు (సుమారు 1.3 లక్షల కోట్లు) తమ మొబైల్ ఫోన్ల కోసం వెచ్చించనున్నారని టెక్నాలజీ రీసెర్చ్ అండ్ అడ్వయిజరీ సంస్థ గార్ట్ నర్ అంచనా వేసింది. 2014తో పోలిస్తే ఈ మొత్తం 4 శాతం అధికమని తెలిపింది. తక్కువ ధరలకు స్మార్ట్ ఫోన్లు లభిస్తుండటం, పెరుగుతున్న మొబైల్ వినియోగదారుల సంఖ్య తదుపరి సంవత్సరాల్లో ఈ మొత్తాన్ని భారీగా పెంచనుందని అభిప్రాయపడింది. డిసెంబర్ నాటికి ఇండియాలో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 88 కోట్లకు చేరవచ్చని సంస్థ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ నేహా గుప్తా వివరించారు. 2014 చివరకు 83.7 కోట్ల కనెక్షన్లు ఉండగా, ఈ సంవత్సరం 5 శాతం పెరిగాయని ఆమె తెలిపారు. స్మార్ట్ ఫోన్లలో డేటా కోసం పెడుతున్న ఖర్చు 15 శాతం పెరిగి 6.5 బిలియన్ డాలర్లకు (రూ. 42,340 కోట్లు) చేరవచ్చని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. భవిష్యత్తులో 4జి సేవల విస్తరణ నేపథ్యంలో డేటా కోసం వెచ్చించే మొత్తం భారీగా పెరగవచ్చని ఆమె అంచనా వేశారు.

  • Loading...

More Telugu News