: రూ. 799 ప్రారంభ ధరతో లక్ష టికెట్లు: స్పైస్ జెట్


ఆగస్టు 22 నుంచి వచ్చే సంవత్సరం మార్చి 26 వరకూ విమాన ప్రయాణాలు చేసే వారికి స్పైస్ జెట్ బంపరాఫర్ ప్రకటించింది. రూ. 799 ప్రారంభ ధర నుంచి లక్ష టికెట్లను అందుబాటులో ఉంచినట్టు గురువారం నాడు వెల్లడించింది. ఈ టికెట్లను ఆగస్టు 22లోగా బుక్ చేసుకోవాలని, ఢిల్లీ, ముంబై, గోవా, బెంగళూరు, శ్రీనగర్ తదితర గమ్యస్థానాలకు టికెట్లను పొందవచ్చని తెలిపింది. ఢిల్లీ-చండీగఢ్, ముంబై-గోవా, బెంగళూరు-కొచ్చి, మధురై-చెన్నై, జమ్ము-శ్రీనగర్ రూట్లలో రూ. 799 ధర లభిస్తుందని వివరించింది. స్పైస్ జెట్ మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే అదనంగా మరో 10 శాతం డిస్కౌంటును పొందవచ్చని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శిల్పా భాటియా తెలిపారు. విమాన ప్రయాణాలను మరింత మందికి దగ్గర చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

  • Loading...

More Telugu News