: గోవా మాజీ సీఎంకు మరో షాక్... ఈడీ, క్రైం బ్రాంచ్ సోదాలు ముమ్మరం


లంచం కేసులో తృటిలో అరెస్ట్ నుంచి తప్పించుకున్న గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ కు ఒక్క రోజు గడిచిందో, లేదో భారీ షాక్ తగిలింది. కామత్ ను అరెస్ట్ చేసేందుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకున్న గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు, కామత్ కు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో అరెస్టు నుంచి వెనక్కు తగ్గారు. అయితే లంచం కేసులో కామత్ కు పాత్ర ఉందన్న విషయంపై పక్కా ఆధారాలు సేకరించిన క్రైం బ్రాంచ్ పోలీసులు నేటి ఉదయం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులతో కలిసి కామత్ ఇళ్లపై మూకుమ్మడిగా సోదాలకు దిగారు. మార్గోవాలోని కామత్ ఇల్లు, పనాజీలోని ఆయన సన్నిహితుల ఇంటితో పాటు మరో రెండు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ (జికా) నిధులతో కొనసాగుతున్న ఓ పనిని అమెరికాకు చెందిన లూయిస్ బెర్జర్ కంపెనీకి అప్పగించేందుకు కామత్ తో పాటు ఆయన కేబినెట్ లో ప్రజా పనుల శాఖ మంత్రిగా పనిచేసిన చర్చిల్ అలెమావో లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై గోవా క్రైం బ్రాంచ్ తో పాటు ఈడీ కూడా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిధుల లావాదేవీలకు సంబంధించి కామత్ వద్ద ఉన్న ఓ కీలక ఫైలు కోసం పోలీసులు సోదాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News