: కేసీఆర్ తన ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు: టీటీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రౌడీలా వ్యవహరిస్తూ, ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని టీటీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మండిపడ్డారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ ను ఏకపక్షంగా ఎలా మార్చాలనుకుంటారని... ఒకవేళ మార్చాలనుకుంటే అన్ని పక్షాలతో చర్చించాలని అన్నారు. ప్రాణహిత డిజైన్ మార్చడం వల్ల రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజైన్ మార్చాలన్న కేసీఆర్ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈరోజు ఆయన శంషాబాద్ లో ఒక్క రోజు దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.