: మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై హైకోర్టు ఆగ్రహం


మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారుల తీరుపై మండిపడిన కోర్టు సంబంధిత అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. జిల్లాలోని ఆత్మకూరు మండలం చింతకుంట ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయులు రావడం లేదంటూ కొన్ని రోజుల కిందట విద్యార్థులు హైకోర్టుకు లేఖ రాశారు. లేఖను పరిశీలించిన కోర్టు విచారణ చేపట్టింది. బాధ్యులైన అధికారుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేలా ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది. గతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉండడాన్ని అలహాబాద్ హైకోర్ట్ తీవ్రంగా పరిగణించి అధికారులు,రాజకీయ నేతల పిల్లలను తక్షణమే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన తీర్పును న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉపాధ్యాయుల కొరతపై ప్రభుత్వం తరపు న్యాయవాది ఇచ్చిన సమాధానంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో భాగంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు పంపింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2.15 నిమిషాలకు కోర్టు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News