: తలుపులు మూసి బిల్లు పాస్ చేశారు... వెంకయ్య అభిమన్యుడిలా పోరాడారు: చంద్రబాబు


రాష్ట్ర విభజన జరిగిన తీరు తలుచుకుంటే తనకు ఇప్పటికీ బాధ కలుగుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. లోక్ సభ తలుపులు మూసేసి, టీవీ ప్రసారాలు కట్ చేసి, ఏపీని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా విభజించిందని మండిపడ్డారు. రాజ్యసభలో వెంకయ్యనాయుడు అభిమన్యుడిలా పోరాడారని కితాబిచ్చారు. కేవలం ఆయన వల్లే ప్రత్యేక హోదా తదితర హామీలు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ నేతలు చేసిందంతా చేసి, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాను రాజకీయం చేయడం మంచిది కాదని సూచించారు. ఏపీని నెంబర్ వన్ చేసేంత వరకు నిద్రపోకుండా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులు బాగా సహకరిస్తున్నారని చెప్పారు. కేంద్ర సహకారంతో అభివృద్ధి దిశగా దూసుకుపోదామని అన్నారు. పట్టిసీమపై వైకాపా, కాంగ్రెస్ పార్టీలు రాద్ధాంతం చేసినా ప్రజలు నమ్మలేదని అన్నారు. అనంతపురంలో సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News