: కాశ్మీర్ లో వేర్పాటువాదుల గృహ నిర్బంధం


జమ్మూ కాశ్మీర్ లో వేర్పాటువాద హురియత్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వేర్పాటువాదులు యాసిన్ మాలిక్, సయ్యద్ అలీ షా గిలానీ, మిర్వాజ్ ఉమర్ ఫరూఖ్ ను నిర్బంధంలో ఉంచినట్టు పోలీసులు తెలిపారు. వచ్చే ఆదివారం భారత్, పాకిస్థాన్ ల మధ్య ఎన్ఎస్ఏ స్థాయి సమావేశం జరగనున్న నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకే వేర్పాటువాదులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News